నాగచైతన్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లని మొదటి రోజునే రాబట్టి సంచలనం సృష్టించిన చిత్రం శైలజారెడ్డి అల్లుడు . నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం మొదటి రోజున 12 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించి అక్కినేని నాగచైతన్య కెరీర్ లో నెంబర్ వన్ గా నిలిచింది . మొదటి రోజున 9 కోట్ల ని మించి వసూల్ చేయలేకపోయాడు నాగచైతన్య కానీ శైలజారెడ్డి అల్లుడు చిత్రంతో మాత్రం ఆ రికార్డ్ ని బ్రేక్ చేసి 12 కోట్ల గ్రాస్ ని దాదాపు 7 కోట్ల షేర్ ని అందుకున్నాడు .
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చింది అయినప్పటికీ మంచి వసూళ్లని సాధించాడు . ఇక ఈరోజుతో పాటుగా ఆదివారం వరకు బాగానే కలెక్షన్లు ఉంటాయి . సోమవారం నుండి శైలజారెడ్డి అల్లుడు కు అసలు పరీక్ష మొదలు కానుంది . నాగచైతన్య సరసన అనుపమా పరమేశ్వరన్ నటించగా కీలక పాత్రలో అత్తగా రమ్యకృష్ణ నటించింది .