నా నటన చూస్తే నాకే చీ అనిపిస్తుంది – సమంత

నా నటన చూస్తే నాకే చీ అనిపిస్తుంది - సమంత

0
123

క్కినేని సమంత తాజాగా నటిస్తున్న సినిమా యుటర్న్. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 13న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని మిస్టర్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు ప్రమోషనల్ విడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

“యూ టర్న్” మూవీ వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన సమంత మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పింది. “హీరోయిన్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండా ఛాన్స్ వచ్చింది మొదటి సినిమాతోనే మంచి పేరు రావడంతో హీరోయిన్ గా కొనసాగాలని ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నేను చేసిన పాత్రలు, నా నటన చూస్తే నాకే చీ అనిపిస్తుంది. మరీ ఇంత దారుణంగా నటించాను ఏంటీ? అని అనుకున్న సందర్బాలు చాలానే ఉన్నాయి. కెరీర్ ఆరంభంలో ఎలాంటి సినిమాలు ఎంపిక చేసుకోవాలో తెలియదు. ఎలాంటి కథలు సక్సెస్ అవుతాయి?, ఎలాంటి సినిమాలు ప్రేక్షకుల ఆధరణ పొందుతాయి?,ఎటువంటి పాత్రల్లో నటిస్తే ఎప్పటికి ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు.. అనే విషయాలు తెలియని కారణంగా వచ్చిన ప్రతి సినిమాకు సైన్ చేశాను. ఇప్పుడు ఆ సినిమాల గురించి తల్చుకుంటే ఆ సినిమాలను చేయకుంటే బాగుండేది” అని సమంత వెల్లడించింది.