Samantha latest post: చాలా రోజుల తరువాత సోషల్ మీడియాలో తన సెల్ఫీని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది సమంత. అందులో ఉన్న సమంత ఇచ్చిన మెసేజ్‌ను చూసిన నెటిజన్లు.. సమంత మెసేజ్ అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఆ సెల్ఫీలో ముఖం కనపడకుండా, నువ్వు ఎప్పటికీ ఒంటరిగా నడవవు అని రాసి ఉన్న టీ షర్ట్‌ను వేసుకొని ఉన్న ఫోటోను షేర్ చేసింది. షూటింగ్స్‌లో ఏ మాత్రం సమయం చిక్కినా, అభిమానులతో చిట్ చాట్ చేయటం, లేదా, తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సమంత షేర్ చేస్తూ ఉండేది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాకు ఎంతో దూరంగా ఉన్న ఈ అమ్మడు, రీసెంట్‌గా తన పెంపుడు జంతువు ఫోటోను షేర్ చేస్తూ.. వెనక్కి తగ్గా.. కానీ ఓడిపోలేదు అని క్యాప్షన్ రాసింది.
చాలా రోజుల తరువాత సోషల్ మీడియాలో తన సెల్ఫీని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది సమంత. ప్రస్తుతం సమంత లేటెస్ట్ పోస్ట్ (Samantha latest post) కాస్తా వైరల్‌గా మారింది. ఇప్పుడు షేర్ చేసిన పిక్ సైతం అంతే వైరల్‌గా మారటంతో.. సమంత నాగ చైతన్యను ఉద్దేశించే ఈ కోట్స్ పెడుతోందంటూ గుసగుసలాడుతున్నారు. కాగా సమంత నటించిన యశోద, శాకుంతలం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వరణ్ ధావన్‌తో కలిసి చేయనున్న సిటాడెట్ ఇండియా వెబ్‌సిరీస్ సైతం ఈ ఏడాదిలోనే పట్టాలెక్కనుంది.
Read Also: మొలకులు వారు తింటే.. అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే!
In case you needed to hear this as well..
YOU’LL NEVER WALK ALONE ♥️ pic.twitter.com/ot0xtkWTVT— Samantha (@Samanthaprabhu2) October 11, 2022