వచ్చే వారం మజిలీ లో భార్య భర్త

వచ్చే వారం మజిలీ లో భార్య భర్త

0
133

డైరెక్టర్ శివ దర్శకత్వంలో ‘మజిలీ’ చిత్రం రూపొందుతోంది. ఈ సిన్మాలో చైతూ, సమంత జంటగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సమంత, చైతూ విదేశాల్లో ఉండటంతో, ఇతర పాత్రల సన్నివేశాలను షూట్ చేస్తున్నారు చిత్ర బృదం. వచ్చేవారం నుంచి ఈ సినిమా షూటింగులో సమంత .. చైతూల షెడ్యూల్ మొదలు కానుంది. ఈ సిన్మాలో భార్యాభర్తలుగానే వాళ్లు కనిపించనుండటం గమనార్హం.

పెళ్లి తర్వాత సమంత, చైతూ కలిసి నటిస్తోన్న సినిమా ఇదే కావడంతో వీరి పాత్రలపై మరింత ఆసక్తి పెరిగింది. గోపీసుందర్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేకమైన ఆకర్షణ నిలవనుందని టాక్. ‘నిన్నుకోరి‘ సినిమాతో దర్శకుడిగా యూత్ ను మెప్పించిన శివ నిర్వాణ, ఈ సినిమాతో మరోసారి మంచి మార్కులు కొట్టేయడం ఖాయమని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. హిందీ నటి దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.