Breaking: చైతూతో విడాకులపై సమంత సంచలన పోస్ట్‌ (వీడియో)

Samantha sensational post on divorce in Chaitu (video)

0
271

టాలీవుడ్ బ్యూటీ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత- నాగ చైతన్య జంట విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్ళ తరువాత విడిపోతున్నట్లు ప్రకటించడం అభిమానులకు షాక్ కి గురిచేసింది.

విడాకులు తీసుకున్న అనంతరం సమంత తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది. ఇటు వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే తన స్నేహితులతో విహార యాత్రలకు వెళుతోంది. మరోవైపు చైతన్య  కూడా వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. అటు తన విడాకులపై నెటిజన్లు కామెంట్లు చేసే అంశంపై కూడా సమంత చాలా స్ట్రాంగ్‌ గా కౌంటర్‌ ఇస్తూనే ఉంది.

తాజాగా తన విడాకులపై సమంత సంచలన పోస్టు చేసింది. సద్గురు వీడియోను షేర్‌ చేస్తూ.. విడాకుల ప్రస్తావన తెచ్చింది సామ్. ”మీరు జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ.. ఆ అనుభవాన్ని జీవితంలో ముందుకు వెళ్లడానికి.. మంచి మనిషిగా జీవించడానికి ఉపయోగించుకోవచ్చని చెప్పిన మాటలున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ గా మారింది.

https://instagram.com/stories/samantharuthprabhuoffl/2784411727574652011?utm_medium=share_sheet