మరో వెబ్ సిరీస్ కు సమంత సైన్..ఈసారి బాలీవుడ్ హీరోతో..

0
120

విడాకుల అనంతరం ఫుల్ జోష్ మీదుంది సమంత. వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంద్. అలాగే వీలు దొరికినప్పుడల్లా ఫ్రెండ్స్ తో కలిసి విహారయాత్రలకు విహార యాత్రలకు వెళుతోంది. అటు తన విడాకులపై నెటిజన్లు కామెంట్లు చేసే అంశంపై కూడా సమంత చాలా స్ట్రాంగ్‌ గా కౌంటర్‌ ఇస్తూనే ఉంది.

ఫ్యామిలీ మ్యాన్ 2 రేప్ సిరీస్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన సమంత… అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా ఇందులోని యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇదిలా ఉండగా తాజాగా మరో వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది సమంత.

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించనున్న ఈ వెబ్ సిరీస్ లో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. అమెరికాకు చెందిన పాపులర్ వెబ్ సిరీస్ ఇండియన్ వర్షన్ లో సమంత, వరుణ్ నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉన్నాయని సమాచారం. దీంతో సమంత ప్రత్యేక శిక్షణ తీసుకుంటోందని తెలుస్తోంది. తరచూ తన సోషల్ మీడియాలో కసరత్తులు చేస్తున్న ఫోటోలను కూడా పెట్టిన సంగతి తెలిసిందే. మొత్తానికి హీరోయిన్ గా ఉన్న సమంత.. మగరాయుడిలా మారబోతుందట్టు కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.