టెన్త్ అర్హతతో పోస్టల్ జాబ్స్..రేపే చివరి తేదీ..పూర్తి వివరాలివే..

0
40

పోస్టల్ లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. రూ.63,200 వేతనంతో పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అప్లై చేయడానికి మరో రోజు మాత్రమే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు అర్హత ఏమిటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

విభాగం:

కేంద్ర సమాచార, ఐటీ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ న్యూ ఢిల్లీలోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఖాళీలు: 29

అన్‌రిజర్వ్‌డ్- 15, ఎస్‌సీ- 3, ఓబీసీ- 8, ఈడబ్ల్యూఎస్- 3 పోస్టులున్నాయి.

చివరి తేదీ: మార్చి 15

ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అంటే అప్లికేషన్ ఫామ్స్ స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి. అలాగే లైట్ మోటార్ వెహికిల్, హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.

అభ్యర్థుల వయస్సు 27 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు ఫీజు లేదు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

అభ్యర్థులు https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. Recruitment సెక్షన్‌లో Staff Car Driver (Ordinary Grade) నోటిఫికేషన్ క్లిక్ చేయాలి. దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్‌లో ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.

దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి. కొరియర్ ద్వారా పంపే దరఖాస్తుల్ని పరిగణలోకి తీసుకోరు. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్- The Senior Manager , Mail Motor Service, C-121,Naraina Industrial Area phase-I, Naraina, New Delhi -110028.

దరఖాస్తుల్ని పరిశీలించిన తర్వాత ఇండియా పోస్ట్ నుంచి టెస్ట్‌కు సంబంధించిన సమాచారం అందుతుంది. ఎంపికైనవారికి ఏడో పే కమిషన్ పే మ్యాట్రిక్స్‌లో లెవెల్ 2 పే స్కేల్ వర్తిస్తుంది. రూ.19,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.63,200 వేతనం లభిస్తుంది.