సంజయ్​ లీలా భన్సాలీ-​ అల్లుఅర్జున్​ కాంబోలో సినిమా?

0
111

బాలీవుడ్​ ప్రముఖ దర్శకుడు సంజయ్​ లీలా భన్సాలీ-ఐకాన్​ స్టార్​ అల్లుఅర్జున్​ కాంబోలో సినిమా రాబోతోందా? ఇప్పుడు ఈ వార్త ఎందుకు బయటకు వచ్చిందో తెలుసా? సోమవారం ముంబయిలోని సంజయ్​ కార్యాలయంలో ఆయనను బన్నీ కలవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం దీనికి సంబంధించి వార్త మీడియాలో హల్ చల్ చేస్తుంది.

కాగా, ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా స్థాయికి ఐకాన్​ స్టార్ అల్లుఅర్జున్ క్రేజ్ అమాంతం పెరిగింది​. ‘తగ్గేదే లే’ అంటూ ఒక్క డైలాగ్​తో పాన్​ ఇండియా స్టార్​గా మారిపోయారు బన్నీ. ఆయన మేనరిజానికి ఫ్యాన్స్​ ఫిదా అయిపోయారు. గతేడాది డిసెంబరు 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం సూపర్​హిట్​ను అందుకుంది. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ రెండో భాగంలో నటిస్తున్నారు.

అయితే ఈ భారీ విజయంతో ఆయనకు బడా ఆఫర్లు వరుసగా క్యూ కడుతున్నాయట. ఆయన కూడా ఇకపై తన తదుపరి సినిమాలన్నీ పాన్​ ఇండియా స్థాయిలోనే రూపొందించాలని దృష్టి పెట్టారట. ఈ నేపథ్యంలోనే సంజయ్​ లీలా భన్సాలీకి సినిమాలను రూపొందించడంలో ప్రత్యేక శైలి ఉంది. ఇటీవలే ఆయన తెరకెక్కించిన గంగూబాయ్​ కతియావాడి’ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్​హిట్​ను అందుకుంది.