సరిలేరు నీకెవ్వరు 6 డేస్ కలెక్షన్లు చూడండి మతిపోతుంది

సరిలేరు నీకెవ్వరు 6 డేస్ కలెక్షన్లు చూడండి మతిపోతుంది

0
104

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకేవ్వరు సంక్రాంతి బరిలో సక్సెస్ గా దూసుకుపోతోంది. ఈ చిత్రం విడుదల అయిన తొలి రోజే పాజిటివ్ టాక్ సాధించింది. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి చిత్రాలు చేస్తున్న మహేష్ చాలా కాలం తర్వాత కమర్షియల్ మూవీ చేశారు. దీంతో బాక్సాఫీస్ వద్ద సరిలేరు నీకెవ్వరు సినిమా దద్దరిల్లుతోంది. 750 కే డాలర్లు తొలిరోజు అమెరికాలో సాధించింది మహేష్ చిత్రం.

నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అన్నట్లు కలెక్షన్లలో దూసుకుపోతుంది. పోకిరి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన మహేష్ ఈ సారి సరిలేరు నీకెవ్వరుతో మరోసారి రికార్డులు సృష్టించనున్నాడు. కలెక్షన్లు చూస్తే ప్రతీ చోటా దద్దరిల్లిపోతున్నాయి, మరో పక్క అలవైకుంఠపురంలో సినిమా కూడా అదే రేంజ్ లో దూసుకుపోతుంటే రెండు చిత్రాలకు ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ అనే బోర్డులు కనిపిస్తున్నాయి…ఆరు రోజుల్లో రూ.80 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి అన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది.

నైజాం… రూ.26కోట్ల రూపాయలు
ఉత్తరాంధ్రలో … రూ.12కోట్ల రూపాయలు
సీడెడ్… రూ.12 కోట్ల రూపాయలు
గుంటూరు… రూ9 కోట్ల రూపాయలు
ఈస్ట్ గోదావరి… రూ7 కోట్ల రూపాయలు
కృష్ణా… రూ. 6కోట్ల రూపాయలు
వెస్ట్ గోదావరి… రూ. 5కోట్ల రూపాయలు
నెల్లూరు… రూ.3కోట్ల రూపాయలు