సర్కారు వారి పాటలో విలన్ గా ఎవరు? తెరపైకి ముగ్గురు

సర్కారు వారి పాటలో విలన్ గా ఎవరు? తెరపైకి ముగ్గురు

0
80

ఏ సినిమాలో అయినా కచ్చితంగా హీరో పాత్రకి తగినట్లు విలన్ పాత్ర కూడా అంతే బలంగా ఉండాలి. అప్పుడే సినిమాకు మజా ఉంటుంది, పాత్రలు తేలిపోకుండా బలంగా ఉంటాయి, కధకి ప్లస్ అవుతుంది, అందుకే నార్త్ నుంచి కూడా చాలా మంది విలక్షణ నటులని విలన్ క్యారెక్టర్లకి తీసుకుంటున్నారు.

ఇక తాజాగా దర్శకులు నిర్మాతలు ఇప్పుడు బీ టౌన్ పై ఫోకస్ పెట్టారు. తాజాగా ప్రిన్స్ అభిమానులు కూడా సర్కారు వారి పాటగురించే ఆలోచిస్తున్నారు..దర్శకుడు పరశురాం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటున్నారట.మహేశ్ సరసన నటించే నాయికగా కీర్తి సురేశ్ ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది.

ఇక మిగిలిన క్రూ అంతా ఫిక్స్ అవుతున్నారు, అయితే ఇక సంగీతం థమన్ ఇవ్వనున్నారు.
ఇక మహేష్ కు ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి, ముందుగా అరవింద్ స్వామి, ఉపేంద్ర, సుదీప్ పేర్లను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. మరి చూడాలి వీరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో.