సాయిధరమ్ తేజ్ అభిమానులకు చల్లటి కబురు..

0
119

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయిధరమ్‌తేజ్‌ కోలుకుంటున్నారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా పోస్టు పెట్టి, అభిమానులకు చల్లటి కబురు చెప్పారు.

ట్విటర్‌లో థంబ్స్‌ అప్‌ సింబల్‌ చూపిస్తూ..మీరు నాపై, నా సినిమా ‘రిపబ్లిక్‌’పై చూపించిన ప్రేమ, అభిమానం, ఆదరణకు కృతజ్ఞతగా థ్యాంక్స్‌ చెప్పడం చాలా చిన్న మాట అవుతుంది. మీ అందరి ముందుకు త్వరలోనే వస్తా’’ అని ట్వీట్‌ చేశారు.

గతనెల 10వ తేదీన సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.  సాయితేజ్‌ ట్వీట్‌ మెగా అభిమానుల్లో నూతన ఉత్సాహం నింపింది. కాగా సాయి తేజ్‌ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్‌ సినిమా అక్టోబర్ 1న విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తుంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ది