రెండో సినిమాకి ఉప్పెన దర్శకుడికి భారీ రెమ్యునరేషన్ టాలీవుడ్ టాక్ ?

రెండో సినిమాకి ఉప్పెన దర్శకుడికి భారీ రెమ్యునరేషన్ టాలీవుడ్ టాక్ ?

0
94

టాలెంట్ ఉండాలే కాని చిత్ర సీమలో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.. ఇక ఓ సినిమా హిట్ అయింది అంటే హీరోలు కూడా ఆ దర్శకుడి కోసం వెంట పడతారు.. మంచి కథ చెప్పమని కోరతారు.. నిర్మాతలతో మాట్లాడి సినిమా పట్టాలెక్కిస్తారు, ఇప్పుడు ఉప్పెన దర్శకుడికి టాలీవుడ్ లో మంచి ఫేమ్ వచ్చింది.

 

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించారు. అందమైన ప్రేమకథ ని వెండి తెరపై చాలా బాగా చూపించారు… అయితే ఈ చిత్రానికి భారీ వసూళ్లు వచ్చాయి.. నిర్మాతలకు మంచి లాభాలు రావడంతో బుచ్చిబాబుకి

ఒక బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు.

 

అయితే తాజాగా ఓ వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది, ఆయనకు దాదాపు 5 కోట్ల పైనే రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు సిద్దంగా ఉన్నారట… రెండో సినిమాకి మంచి రెమ్యునరేషన్ అందుతోంది అని టాక్ నడుస్తోంది, ఆ చిత్రం త్వరలో అనౌన్స్ మెంట్ వస్తుంది అని అంటున్నారు.. అయితే ఆయన టాలెంట్ కు ఎంత ఇచ్చినా తక్కువే అంటున్నారు సినిమా అభిమానులు, చాలా మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు బుచ్చిబాబు.. ఇక వచ్చే రోజుల్లో ఇలాంటి హిట్లు చాలా ఇస్తారు అని టాలీవుడ్ పెద్దలు అంటున్నారు.