ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో బిగ్ హిట్ అయిన లిస్టులో సీతారామం ఒకటి. అద్భుతమైన ప్రేమకావ్యంగా తెరకెక్కిన సీతారామంలో దుల్కర్ సల్మాన్, మణాల్ ఠాకూర్ జంటగా నటించారు. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో మెప్పించారు.
యుద్ధంతో రాసిన ఈ ప్రేమ కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాకు చేసిన ప్రమోషన్స్ తక్కువే అయిన ప్రేక్షకులు భారీ హిట్ ను ఇచ్చారు. యుద్ధంతో కూడిన ప్రేమకథ విశేషంగా ఆకట్టుకుంది. క్లైమాక్స్ విషాదంతంతో కూడడం ఈ సినిమా భిన్నమైందిగా నిలిచిపోయింది.
తాజాగా విదేశీయులు సైతం ఈ చిత్రాన్ని చూసి ఫిదా అవుతున్నారు. ఇక మోనికా అనే పోలాండ్‌కు చెందిన అభిమాని.. ఈ చిత్రంపై తన ప్రేమను తెలియజేస్తూ నాలుగు పేజీల లేఖను రాసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. ” సీతారామం చిత్ర యూనిట్‌కు పోలాండ్ నుంచి లేఖ రాస్తున్నాను. ఈ లేఖను ఎవరైనా చదువుతారా, లేదా అన్నది నాకు తెలియదు. కానీ ఈ చిత్రంపై నా ప్రేమను, అభిమానాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను” అని పోస్ట్‌లో తెలిపింది.
లేఖలో ఏముందంటే..?
“నేను లెఫ్టినెంట్ రామ్‌తో ప్రేమలో పడిపోయాను.. అతడిని ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను. ఇంత అద్భుతమైన పాత్రను సృష్టించారు చిత్ర యూనిట్. అలాగే సీత పాత్రలో మృణాల్‌ను తప్ప మరెవరినీ ఊహించుకోలేకపోతున్నాను. మృణాల్… మీరు నా మనసును గెలుచుకున్నారు. ప్రతి ఫ్రేమ్‌లో ఎంతో అందంగా కనిపించారు. మిమ్మల్ని చూస్తే ఓ అందమైన దేవకన్యగా అనిపించారు. అలాగే మీకు గాత్రం అందించిన సింగర్ చిన్మయి శ్రీపాద లేకుండా సీతామహాలక్ష్మీ అసంపూర్ణం. సీతారామం చిత్రయూనిట్‌కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చింది.