హాస్పటల్ లో హరికృష్ణ పార్దీవ దేహంతో సెల్ఫీ..

హాస్పటల్ లో హరికృష్ణ పార్దీవ దేహంతో సెల్ఫీ..

0
88

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై నార్కట్ పల్లి లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొంది మరణించిన విషయం తెలిసిందే . కాగా హరికృష్ణ మరణించిన సమయంలో అతడికి సేవలందిస్తున్న కామినేని ఆసుపత్రిలోని నలుగురు సిబ్బంది హరికృష్ణ పార్దీవ దేహంతో సెల్ఫీ తీసుకోవడం దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం సంచలనంగా మారింది . హరికృష్ణ చనిపోయి ఉంటె ఆ బాడీ తో సెల్ఫీ లు దిగడంతో సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . మానవత్వం మంటగలిసి పోయిందని సదరు సెల్ఫీ రాయుళ్ల పై నిప్పులు చెరుగుతున్నారు .

సెల్ఫీ లు ఎక్కడ ఎప్పుడు తీసుకోవాలో కూడా తెలీని వాళ్ళు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . కాగా తీసుకున్నవాళ్ళు సైలెంట్ గా ఉండకూండా వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో వాళ్లకు ఇబ్బందులు వచ్చి పడ్డాయి . సెల్ఫీ లో స్పష్టంగా ఫోటోలు తీసుకున్న వాళ్ళు కనబడుతున్నారు కాబట్టి ఆసుపత్రి వర్గాలు వాళ్లపై చర్యలు తీసుకుంటారేమో !