ఈ 2020 ఏడాది అస్సలు కలిసిరాలేదు అనే చెప్పాలి చిత్ర సీమకు,చాలా మంది ప్రముఖులు కరోనాతో మరణిస్తే మరికొందరు అనారోగ్యాలతో మరణించారు, అయితే తాజాగా తెలుగు తమిళ చిత్ర సీమలో అగ్రహీరోయిన్ గా కొనసాగిన జయచిత్ర ఇంట తీవ్ర విషాద ఘటన జరిగింది.
సీనియర్ నటి, దర్శకురాలు జయచిత్ర భర్త గణేశ్ కన్నుమూశారు. తిరుచ్చిలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనని ఆస్పత్రికి తరలించారు, అయితే అప్పటికే ఆయన చనిపోయారు, ఇక ఆయన భౌతికకాయం
చెన్నైలోని పోయెస్ గార్డెన్లో సొంత ఇంటికి తరలించారు. గణేశ్ పార్థివదేహానికి తెలుగు తమిళ సినీ ప్రముఖులు నివాళులర్పించారు.
జయచిత్ర సుమారు 200కి పైగా తెలుగు తమిళ చిత్రాల్లో నటించారు, ఆమె నటించిన అన్నీ సినిమాలు సూపర్ హిట్ అనే చెప్పాలి .. 1970 నుంచి 1982 వరకూ ఆమె ఫుల్ బిజీ హీరోయిన్ గా కొనసాగారు, ఇక వారి కుమారుడు మంచి సంగీత దర్శకుడిగా పేరు పొందారు.. ఆయన ఎవరో కాదు ఆమ్రేష్.. హీరోయిన్ గా ఉన్న సమయంలో కుంభకోణం ప్రాంతానికి చెందిన గణేశ్తో ఆమె వివాహం జరిగింది.