‘మా’ అధ్యక్ష పోటీలో మరో సీనియర్ మహిళా నటిమణి

senior female actress in the MAA presidential election race

0
37

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు వేడి రగిలిస్తున్నాయి. ఈ పోటీలో హేమాహేమీలు బరిలోకి దిగబోతున్నారు. రాజకీయ ఎన్నికలను తలదన్నేలా ఈ ఎన్నికలు ఈసారి జరగబోతున్నట్లు వాతావరణం కనబడుతున్నది. మా అధ్యక్ష పదవికి ఈసారి పెద్ద సంఖ్యలో పోటీలో ఉండే చాన్స్ కనబడుతున్నది. ఇప్పటికే ముగ్గురు పోటీ చేయబోతున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో మరో సీనియర్ నటీమణి బరిలో ఉంటానని ముందుకొచ్చింది. ఆమె ఎవరో మీరే చదవండి.

మా అధ్యక్ష పదవికి పోటీలో సీనియర్ నటి హేమ బరిలోకి దిగబోతున్నట్లు సంకేతాలిచ్చారు. ఇప్పటికే ఈ పదవికి పోటీలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు, సీనియర్ నటి జీవిత రాజశేఖర్ దిగనున్నారు. వీరు ముగ్గురే పోటీలో ఉంటే ట్రయాంగిల్ ఫైట్ జరిగేదే. కానీ తాజాగా హేమ కూడా పోటీలో ఉంటానని ప్రకటించడంతో బహుముఖ పోటీ తప్పేలా లేదు. తన వాళ్ల కోసమే తాను పోటీలో ఉంటున్నట్లు హేమ ప్రకటించారు. మా అసోసియేషన్ లో గత కొంతకాలంగా హేమ పలు పదవులకు పోటీ చేసి గెలుస్తూ వచ్చారు. ఆర్టిస్టుల ప్రయోజనాల కోసం శక్తిమేరకు పనిచేశారు. అధ్యక్ష పదవికి పోటీ విషయమై హేమ కొంతమంది మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను ఇప్పటి వరకు మా ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసి సభ్యురాలిగా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. తాను చేపట్టిన ప్రతి పదవికి న్యాయం చేశానని, అందుకే ఈసారి తనవాళ్ల కోసం అధ్యక్ష పదవికే పోటీ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు.


నిజానికి ఈసారి మా ఎన్నికల్లో ట్రెజరర్ పదవికి పోటీ చేయాలని తాను అనున్నట్లు హేమ వివరించారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత లాంటి హేమాహేమీలు పోటీ చేస్తున్న తరుణంలో పెద్దవాళ్ల మధ్యలో తాను పోటీ చేయడమెందుకు అనుకన్నట్లు చెప్పారు. ట్రెజరర్ పదవికే పోటీ చేస్తే సరిపోతుందనుకున్నట్ల వెల్లడించారు. కానీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో సినీ ప్రముఖుల నుంచి వస్తున్న వత్తిడి కారణంగా తన ఆలోచన మారిందని, అధ్యక్ష పదవికే పోటీ చేయబోతున్నట్లు తెలిపారు.
ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసినప్పుడు తన స్నేహితులు, మద్దతుదారులు, లేడీ సపోర్టర్స్ అత్యధిక మెజార్టీతో గెలిపించారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అధ్యక్ష పదవికి ఎందుకు పోటీ చేయకూడదు అంటూ తనను ప్రశ్నిస్తున్నారని చెప్పారు. నువ్వుంటేనే మాకేమైనా ఆపదొస్తే అర్థరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటావు అని తనను ఫోర్స్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు హేమ. ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు నాకు సపోర్ట్ గా నిలిచిన వారందరి కోసం మా అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్నట్లు కుండబద్ధలుకొట్టారు హేమ.