శంకర్ చరణ్ సినిమా సెట్స్ పైకి ఎప్పుడంటే ?

0
45

శంకర్ దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి అనౌన్స్ మెంట్ వచ్చిన తర్వాత అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్న చరణ్ ఆ తర్వాత శంకర్ తో సినిమా పట్టాలెక్కించనున్నారు. ఇందులో భారీ తారాగణం ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

శంకర్ క్రియేటివిటీ మాములుగా ఉండదు. ఒక పాటను ప్రపంచంలోని ఏడు అద్భుతాల దగ్గర చిత్రీకరించిన దర్శకుడు ఆయన. ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గరు. ఇక దిల్ రాజు ఇప్పుడు ఆయనతో సినిమా చేస్తున్నారు. దర్శకుడిగా శంకర్ తన వైపు నుంచి అన్ని పనులు చకచకా పూర్తి చేస్తున్నాడట. ఇక ఆచార్య కంప్లీట్ అయింది ఇక ఆర్ ఆర్ ఆర్ కూడా కంప్లీట్ అవుతోంది. ఇక చరణ్ కూడా శంకర్ సినిమాకి సిద్దం అవుతున్నారని తెలుస్తోంది.

సెప్టెంబర్ అంటే వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి అవ్వచ్చు అంటున్నారు. ఇక వచ్చే దసరాకి శంకర్ సినిమా వస్తుందని టాలీవుడ్ టాక్ నడుస్తోంది.