Slumdog Millionaire | ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సీక్వెల్ రెడీ..!

-

భాషతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్న సినిమా ‘స్లమ్ డాగ్ మిలియనీర్(Slumdog Millionaire)’. ఈ సినిమాకు 8 ఆస్కాల్‌లు వచ్చాయి. ఇప్పటికి కూడా ఈ మూవీకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్ తీయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా ఈ సినిమా సీక్వెల్ హక్కులను ఇటీవల ప్రారంభించిన ‘బ్రిడ్జ్ 7(Bridge 7)’ అనే నిర్మాణ సంస్థ సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తోంది. ఈ సీక్వెల్ కూడా జమేల్ జర్నీగానే ఉండనుందని తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు ఈ సీక్వెల్‌కు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు.

- Advertisement -

తాజాగా ఈ విషయంపై సినిమా దర్శకుడు కూడా స్పందించారు. ‘‘కొన్ని కథలు ఎంత కాలం పోయినా ఆసక్తిగానే ఉంటాయి. అలాంటి వాటిలో స్లమ్ డాగ్ మిలియనీర్(Slumdog Millionaire) కూడా ఒకటి. ఒక మంచి కథకు భాషాపరమైన హద్దులు ఉండవని ఈ కథ నిరూపించింది’’ అని అన్నారు. మరి ఈ సినిమా సీక్వెల్ ఎప్పటి నుంచి పట్టాలెక్కుతుందో, దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి. ప్రేక్షకుల ఆసక్తి, ఆత్రుత చూసైనా మేకర్స్ అతి త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాలి.

Read Also: ‘కేసులకు నేనేమీ భయపడట్లేదు’
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ram Mohan Naidu | ఆ ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. ఎంపీ రామ్మోహన్ నాయుడి వార్నింగ్

తమ ప్రభుత్వం ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించడం లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు(Ram...

న్యూ ఇయర్ వేడుకలు.. గీత దాటితే తాట తీస్తామంటోన్న పోలీసులు

New Year Celebrations | న్యూ ఇయర్ వేడుకలకి తెలుగు రాష్ట్రాలు...