సోషల్ మీడియా లో దుమ్మురేపుతున్న మరో అడల్ట్ కంటెంట్ ట్రైలర్..!!

సోషల్ మీడియా లో దుమ్మురేపుతున్న మరో అడల్ట్ కంటెంట్ ట్రైలర్..!!

0
114

అనగనగా ఓ అబ్బాయి. పేరు కార్తీక్. ప్రేమ, పెళ్లి పేరుతో పలువురు యువతులను మోసం చేశాడని అతడిపై కేసు నమోదు అవుతుంది. దాంతో పోలీసులు కార్తీక్ కోసం గాలింపు చర్యలు చేపడతారు. ‘కార్తీక్ మిస్సింగ్‘ అని ఫొటోలు విడుదల చేస్తారు. అయితే… అతడు కార్తీక్ కాదని, కృష్ణమూర్తి అని ఓ వ్యక్తి చెబుతాడు. అమ్మాయిలను మోసం చేసింది ఎవరు? కార్తీక్ ఆ… కృష్ణమూర్తి ఆ? మనిషిని పోలిన మనుషులు ఉన్నట్టు… కార్తీక్ లాంటివాడు ఇంకొకడు ఉన్నాడా? ఇంకొకరు ఎవరైనా కృష్ణమూర్తిలా మారి అమ్మాయిలను మోసం చేశాడా? ఈ సస్పెన్స్ కి జూన్ 5న తెర దించుతామని రమేష్ వర్మ చెబుతున్నారు.

హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘సెవెన్‘. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. త‌మిళ న‌టుడు రెహ‌మాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా సెవెన్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు ర‌మేష్ వ‌ర్మ‌. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో కూడా పూర్తిగా రొమాన్స్ విత్ స‌స్పెన్స్ చూపించాడు ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా హ‌వీష్ హీరోయిన్ల‌తో చేసే రొమాన్స్ ట్రైల‌ర్లో బాగా హైలైట్ అయింది. ఈ చిత్రం క‌చ్చితంగా త‌న‌కు బ్రేక్ ఇస్తుంద‌ని న‌మ్ముతున్నాడు హ‌వీష్. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతో ఈ కుర్ర హీరో ఎలాంటి ఫ‌లితం అందుకోబోతున్నాడో..?