వైసీపీలోకి రాయపాటి కుటుంబం

వైసీపీలోకి రాయపాటి కుటుంబం

0
51

ఏపీ రాజకీయాల్లో రాయపాటి సాంబశివరావు కుటుంబానికి ఎంత పేరు ఉందో తెలిసిందే.. ఎంపీగా ఆయన పేరు గుంటూరు జిల్లాలో ఎప్పుడూ వినిపిస్తుంది.. ఇక ఆయన అడుగు జాడల్లో ఆయన సోదరుడు రాయపాటి శ్రీనివాస్ ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు.. తొలి నుంచి రాయపాటి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉంటున్నారు.. తర్వాత ఏపీ విభజన తర్వాత రాయపాటి కుటుంబం తెలుగుదేశంలో చేరింది. రాయపాటి సాంబశివరావు ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి సీటు సంపాదించి ఎంపీ అయ్యారు.. ఇక ఇప్పటి వరకూ రాయపాటి ఆరుసార్లు ఎంపీగా పనిచేశారు.

శ్రీనివాస్ ఎమ్మెల్సీగా, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. రాయపాటి సోదరులు తర్వాత వారి వారసులుగా మోహన్సాయి కృష్ణ, రంగబాబు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు టీడీపీలో ఉన్నారు రాయపాటి. ఇక ఇటీవల మోహన్ సాయికృష్ణ చేసిన వ్యాఖ్యలు పెనుదూమారం లేపాయి.. బీజేపీ తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ ఈ నాలుగు పార్టీలు ఏపీకి అన్యాయం చేశాయి అని అన్నారు.. తాను ఏ పార్టీలో సంబంధం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేశాను అని తెలియచేశారు ఆయన.. గతంలో గుంటూరు నగర మేయర్గా పనిచేసిన ఆయన ఇప్పుడు అదే సీటుపై ఆశలు పెట్టుకున్నారని, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న వేళ ఆయన తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీలో చేరాలి అని చూస్తున్నారట.. మరి చూడాలి దీనికి కాలమే సమాధానం చెప్పాలి.