Jawan | ఇందుకే కదా.. షారుఖ్‌ను బాలీవుడ్ బాద్ షా అనేది!

-

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటీవల ఆయన చేసిన పఠాన్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.1000 కోట్లకుపైగా కలెక్షన్లు వసూలు చేసి సత్తా చాటింది. దీంతో ఆయన నెక్ట్స్ సినిమాపై అందరి పడింది. ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో షారుఖ్ జవాన్ సినిమా చేస్తున్నాడు. ఈ జవాన్(Jawan) చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్‌ సినిమాపై ఓ రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌ చేశాయి. అప్పుడే బాలీవుడ్‌ ట్రేడ్‌ షారుఖ్‌కు ఈ సినిమా మరో వెయ్యి కోట్ల బొమ్మవుతుందని అంచనా కూడా వేసేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. మరో ఐదారు రోజుల్లో ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ కానుంది.

- Advertisement -

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఓ రేంజ్‌లో బిజినెస్‌ జరుగుతుందట. కేవలం నాన్‌-థియేట్రికల్‌ హక్కులకే రూ.250 కోట్ల రేంజ్‌లో బిజినెస్‌ జరిగిందట. ట్రైలర్‌ కూడా రిలీజ్‌ అవక ముందే ఈ రేంజ్‌లో బిజినెస్‌ జరుగుతుందంటే షారుఖ్ క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో షారుఖ్‌కు జోడీగా నయనతార(Nayanthara) నటిస్తోంది. హిందీతో పాటు పాన్‌ ఇండియా లెవల్లో ఈ సినిమా(Jawan) సెప్టెంబర్‌ 7న రిలీజ్‌ కానుంది. అనురుధ్ రవిచంద్రన్‌(Anirudh Ravichander) స్వరాలు అందిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi) ప్రతినాయకుడి పాత్ర పోషించాడు.

Read Also: బట్టలు లేకుండా వీడియోలు.. రివర్స్ అయిన యువకుడి లైఫ్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...