శాకుంతలం అదరిపోయే అప్డేట్‌.. సమంత ఫస్ట్ లుక్ రిలీజ్!

0
122

మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతున్న తాజా సినిమా శాకుంతలం. ఈ శాకుంతలం సినిమాను.. టాలీవుడ్‌ దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌ లో తెరకెక్కుతోంది. గ్రాపిక్స్‌ కు ఎంతో ప్రాధాన్యమున్న సినిమా ఇది.

ఇక ఇందులో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్రలో దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు. ఇక ఇందులో సమంతతో పాటు.. వరలక్ష్మి కూడా నటిస్తోంది. ఇక ప్రస్తుతం షూటింగ్‌ దశలో శాకుంతలం సినిమా ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్లు.. మూవీపై హైప్‌ ను బాగా పెంచేశాయి.

ఇక తాజాగా శాకుంతలం మూవీ నుంచి అదరిపోయే అప్డేట్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి సమంత ఫస్ట్‌ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌ లో సమంత చాలా అందంగా కనిపిస్తున్నారు. జింకల మధ్య వైట్‌ కలర్‌ డ్రెస్‌ లో సమంత మెరిసిపోతోంది.