చరణ్ కోసం శంకర్ బీభత్సం..ఈ రేంజ్ లోనా?

Shankar harassment for Charan..in this range?

0
117

ప్రపంచం గర్వించదగ్గ ద‌ర్శ‌క దిగ్గ‌జం శంక‌ర్ సినిమాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. భారీ బ‌డ్జెట్‌తో క‌ళ్లు మిర‌మిట్లుగొలిపేలా యాక్ష‌న్ స‌న్నివేశాలు తీస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటారు. ఐదేళ్ళ కిందే 2.0 సినిమా కోసం 400 కోట్లు ఖర్చు చేయించాడు శంకర్. దానికి ముందు కూడా ఈయన సినిమా బడ్జెట్ కోటలు దాటుతుంది. తాను రెమ్యునరేషన్ కట్ చేసుకొని అయిన భారీ బడ్జెట్ తీస్తుంటాడు శంక‌ర్.

ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ సినిమా షూటింగ్ అత్యంత వేగంగా జరుగుతుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి 2022 మధ్యలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు శంకర్. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మాత దిల్ రాజు తన ప్రొడక్షన్ హౌస్‌లో 50వ సినిమాగా RC15 నిర్మిస్తున్నాడు. రామ్ చరణ్ ఇమేజ్‌కు తగ్గట్లు అద్భుతమైన పొలిటికల్ స్టోరీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా కోసం రూ.250 కోట్ల బడ్జెట్ దిల్ రాజు కేటాయించినట్లు తెలుస్తోంది. దాన్ని మించకుండా సినిమా ప్లాన్ చేసుకోవాలని దర్శకుడు శంకర్‌కు నిర్మాత చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శంకర్ కూడా బడ్జెట్ ప్లానింగ్ సిద్ధం చేస్తున్నాడు. మొన్న విడుదలైన RC15 కాన్సెప్ట్ పోస్టర్ కోసం కోసం ఏకంగా 1.73 కోట్ల ఖర్చు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పోస్టర్‌లో సినిమాకి పనిచేస్తున్న కాస్ట్ అండ్ క్రూ అందరూ ఉన్నారు. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.

మరోవైపు శ్రీకాంత్, సునీల్, జయరామ్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. కేవలం కాన్సెప్ట్ పోస్టర్ కోసమే 1.73 కోట్లు ఖర్చు పెట్టేస్తే.. సినిమా అంత తీయడానికి శంకర్ ఎంత బడ్జెట్ పెట్టిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో ఒక యాక్షన్ సన్నివేశం కోసం శంకర్ ఏకంగా 70 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏడు నిమిషాల పాటు జరిగే ఈ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 70 కోట్లు ఖర్చు పెడుతున్నారని ప్రచారం జరుగుతుంది. సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశం ఇదే అని.. అందుకే ఖర్చుకు వెనకాడకుండా తీస్తున్నారని తెలుస్తోంది.