మార్కెట్లోకి మారుతీ సెలెరియో..ధర ఎంతంటే?

What is the price of Maruti Celerio in the market?

0
40

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ సెలెరియో కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.4.99 లక్షల నుంచి రూ.6.94 లక్షల మధ్య ఉండనుంది. ఇంధన సామర్థ్యంలో దేశంలోనే ఉత్తమమైన పెట్రోల్ కారుగా సెలెరియోనూ అభివర్ణించిన కంపెనీ.. ఈ విభాగంలో అత్యధిక మార్కెట్ వాటాను కైవసం చేసుకోవడమే లక్ష్యమని పేర్కొంది. సెలెరియో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని తెలిపింది.

ప్రస్తుతం మార్కెట్​లో అందుబాటులో ఉన్న సెలెరియో మోడల్ కంటే ఇది మరింత విశాలంగా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇంధన సామర్థ్యం 15-23 శాతం మెరుగైనట్లు పేర్కొంది. సౌకర్యవంతమైన ఫీచర్లతో పాటు.. భద్రతకు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపింది. 999సీసీ-కే 10సీ ఇంజిన్​ను అమర్చినట్లు పేర్కొన్న కంపెనీ.. లీటరుకు 26.68 కి.మీల మైలేజీ దీని సొంతమని తెలిపింది.

భారతీయ కార్ మార్కెట్​లో హ్యాచ్‌బ్యాక్‌ల వాటా దాదాపు 46 శాతంగా ఉంది. ‘ఈ నేపథ్యంలో దేశీయ వినియోగదారులకు తమ ఉత్తమ మోడల్ అయిన సెలెరియోను అందించాలని నిర్ణయించినట్లు మారుతీ సుజుకీ ఎండీ, సీఈఓ కెనిచీ అయుకవా పేర్కొన్నారు. అలాగే.. ‘ప్రపంచంలో ఐదో అతిపెద్ద కార్ మార్కెట్‌గా ఉన్న భారత్​లో..సగానికి పైగా కార్లను తమ సంస్థ అందించడం గర్వకారణమని’ చెప్పారు.