వెబ్​సిరీస్​లో షణ్ముఖ్​..ఈసారి సరికొత్తగా..

0
111

యూట్యూబర్ షణ్ముఖ్ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే పలు యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయిన ఈ స్టార్ ఇప్పుడు సరికొత్త థ్రిల్లింగ్ కథతో రానున్నాడు. దీనిని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తీసుకురానుంది.

ఇప్పటివరకు వెబ్​సిరీస్​లలో లవర్​బాయ్​గా అలరించిన యూట్యూబర్​, ‘బిగ్​బాస్​-5’ ఫేమ్​ షణ్ముఖ్.. డిటెక్టివ్​గా మెప్పించనున్నాడు. ఏజెంట్​ ఆనంద్​ సంతోష్​గా కనిపించనున్నాడు. దీనికి అరుణ్​ పవర్​ దర్శకత్వం వహిస్తుండగా.. సుబ్బు స్క్రిప్ట్​ అందిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సోషల్​మీడియా ద్వారా తెలిపింది.

త్వరలోనే స్ట్రీమింగ్​ కానున్నట్లు వెల్లడించింది. ఫస్ట్​లుక్​ పోస్టర్​ను రిలీజ్​ చేసింది. అందులో షణ్ముఖ్​.. చేతిలో సూట్​కేస్​ పట్టుకుని ఉండగా.. దానిపై కేస్​ క్లోజ్డ్​ అని రాసి ఉంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని ఆహా తెలిపింది. ​