షారూఖ్ ఖాన్ ఇంట విషాదం

షారూఖ్ ఖాన్ ఇంట విషాదం

0
91

బాలీవుడ్ సూపర్స్టార్ షారూఖ్ ఖాన్ అంటే తెలియని వారు ఉండరు వరుస హిట్ చిత్రాలు చేస్తూ బిజీగా టాలీవుడ్ లో ఉన్నారు ఆయన. ఇక తాజాగా బీ టౌన్ లో మూడు సినిమాలు ఆయన వరుసగా పెట్టారు, అయితే ఆయన ఇంట విషాదకరమైన సంఘటన జరిగింది…బాలీవుడ్ సూపర్స్టార్ షారూఖ్ ఖాన్కు వరుసకు సోదరి అయిన నూర్జహాన్ పాకిస్తాన్లోని పెషావర్లో కన్నుమూశారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం నూర్జహాన్ సోదరుడు మన్సూర్ అహ్మద్ ఈ విషయాన్ని వెల్లడించారు. కొంతకాలంగా నూర్జహాన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఈ వార్త షారూఖ్ కు తెలియడంతో షాక్ అయ్యారు, నూర్జహాన్ తన సోదరుడు షారూఖ్ ఖాన్ను కలుసుకునేందుకు భారత్కు రెండుసార్లు వచ్చారు. ఆ సమయంలో షారూఖ్ సోదరిని ఎంతో బాగా చూసుకునేవారు.

తాజాగా ఆమె లేరు అనే వార్త వారింట తీవ్ర విషాదం నింపింది. షారూఖ్ ఖాన్, నూర్జహాన్ కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. షారూఖ్ పాక్ వెళ్లనున్నారు అని తెలుస్తోంది.