పవన్ -వెంకటేష్ -రామ్ ముగ్గురికి ఒకేసారి పోటీ

పవన్ -వెంకటేష్ -రామ్ ముగ్గురికి ఒకేసారి పోటీ

0
33
Actor Navdeep, Co Founder C Space Along With Rakesh Rudravanka - CEO - C Space

సంక్రాంతికి సినిమాలు వరుసగా విడుదల అవుతాయి.. చాలావరకూ పండుగ సమయాల్లో సినిమాలు ప్లాన్ చేసుకుంటారు హీరోలు, అయితే తర్వాత అంత బిజినెస్ ఉండేది కూడా సమ్మర్ లోనే అని చెప్పాలి, అందుకే ఈ ఏడాది సమ్మర్ కు సినిమాలు రెడీ అవుతున్నాయి, స్ట్రయిల్ సినిమాలు ఎలాగో ఉంటాయి ఈ సమయంలో రీమేక్ చిత్రాలు కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

మూడు క్రేజీ రీమేక్స్ ఈ వేసవిలో తక్కువ గ్యాప్ లోనే రిలీజ్ కాబోతున్నాయి. ఆ చిత్రాలే… పింక్ రీమేక్, నారప్ప ..రెడ్..పవన్ కల్యాణ్ పింక్ సినిమా మే 15న విడుదల కానుంది, అయితే ఇటు వెంకటేష్ నటిస్తున్న అసురన్ రీమేక్ నారప్ప కూడా రిలీజ్ కానుంది.. ఇక మరో తమిళ సినిమా తడమ్కి రీమేక్ గా రామ్ ‘రెడ్’ని తీర్చిదిద్దుతున్నారు.

ఏప్రిల్ 9న ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది… ఈ వేసవిలో ఈ మూడు చిత్రాలు రీమేక్ చిత్రాలే అవుతున్నాయి, అయితే పవర్ స్టార్ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు విడుదల అదే సమయంలో ఉండటంతో ఏది హిట్ టాక్ తెచ్చుకుంటుందా అని అభిమానులు చూస్తున్నారు, మొత్తానికి పవన్ వెంకీ రామ్ ముగ్గురి సినిమాలు వేసవి బరిలో నిలవనున్నాయి.