ఓటిటి ప్రేక్షకులకు షాక్..ఇకపై 50 రోజుల తర్వాతే..

0
103

కరోనా రావడంతో ప్రస్తుతం సినిమాలు ఓటిటి బాట పడుతున్నాయి. ఇలా థియేటర్లో సినిమా అయిందో లేదో కొద్దీ రోజులకు ఓటిటిలో రావడంతో ప్రేక్షకులు థియేటర్ ను మరిచిపోయారు. ఇంట్లో కూర్చుని మొబైల్ లో సినిమాను చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.

సినిమాలు రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే ఓటీటీల్లో ప్రదర్శించేలా ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారు. జులై 1 తర్వాత ఒప్పందాలు చేసుకునే సినిమాలన్నిటికీ ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. దీంతో థియేటర్లకు లాభం చేకూరనుంది. అయితే ఇది కేవలం పెద్ద సినిమాలకేనా చిన్న సినిమాలకి కూడా వర్తిస్తుందా తెలుపలేదు.

కాగా కరోనా టైంలో థియేటర్లు లేక డైరెక్ట్ గా ఓటీటీలోనే సినిమాలు రిలీజ్ అయ్యాయి. థియేటర్లు ఓపెన్ అయ్యాక కూడా కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వడంతో థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో థియేటర్లో రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలకు అమ్మేస్తున్నారు నిర్మాతలు. మంచి డీల్ వస్తుండటంతో చాలా తొందరగా ఓటీటీలకు ఇచ్చేస్తున్నారు. ఇక చిన్న సినిమాలు, ఫ్లాప్ అయిన సినిమాలు అయితే రెండు వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 50 రోజుల తర్వాతే ఓటీటీల్లో ప్రదర్శించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.