సల్మాన్ ఖాన్ భరిస్తున్న వ్యాధి గురించి వింటే షాక్..

0
108

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే సల్మాన్ ఖాన్ అద్భుతమైన సినిమాలు తీస్తూ నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు. 50 సంవత్సరాల వయస్సు దాటినా కూడా చూడడానికి యంగ్ హీరోగా కనపడుతూ అమ్మాయిల మనసులను కొల్లగొడుతుంటాడు. కేవలం హిందీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

కానీ సల్మాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ తను కొంతకాలంగా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నటు వెల్లడించాడు. ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే అరుదైన వ్యాధితో గత 20 సంవత్సరాలుగా  ఫైట్ చేస్తునట్టు తెలిపారు. ఈ వ్యాధి ఉన్నవారు ఎక్కువసేపు మాట్లాడితే ముఖంపై ఉన్న నరాలు బిగుసుకుపోయి మూతి వక్కర పోయే ప్రమాదం ఉంటుంది.

అంతేకాకుండా ఈ వ్యాధి బారిన పడ్డ వారికి  కరెంట్ షాక్ కొట్టినట్టు రెండు నిమిషాల పాటు నొప్పి పుడుతుంది. దాన్ని తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలనే ఆలోచన కలుగుతుందని సల్మాన్ ఖాన్ మీడియాతో వెల్లడించారు. ఈ వ్యాధి నుండి కోలుకోవడానికి గత 20 సంవత్సరాలుగా సల్మాన్ ట్రీట్ మెంట్ తీసుకున్నట్టు తెలిపారు. జీవితంలో ఎలాంటి ఇబ్బంది వచ్చిన ఎదురిగి పోరాడాలని రియల్ లైఫ్ లో సల్మాన్ మరోసారి ప్రేక్షకులకు చాటిచెప్పాడు.