భీమ్లానాయక్ అప్డేట్..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు షాక్..!

Shock to Pawan Kalyan fans ..!

0
108

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లానాయక్’. మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకు రీమేక్‌గా సాగర్ చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్, పాటలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమాలో డేనియల్‌ శేఖర్‌ అనే పాత్రలో పవన్‌కు పోటీగా నటిస్తున్నాడు రానా. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించిన చిత్రయూనిట్ విడుదల తేదిని వాయిదా వేసింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమాలో నిత్యామేనన్‌, సంయుక్త మేనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్ర్కీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, కాదంబరి కిరణ్‌ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.