Twitter లో రామ్ గోపాల్ వర్మకు షాక్..!

Shock to Ram Gopal Varma on Twitter ..!

0
128

రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది వివాదాస్పదం అవ్వడమే కాకుండా సంచలనంగా మారుతుందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కొండా దంపతుల జీవితం ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఈ సినిమాను ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆపలేరంటూ అప్పుడే వార్నింగ్ కూడా ఇచ్చారు ఆర్జీవీ.

అయితే తాజాగా “నాకెందుకో కేసిఆర్ కు ఈటెల రాజేందర్ వెన్నుపోటు, అలాగే ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు సేమ్ అన్పించింది. అందుకే ఈ ఈటెల రాజేందర్ వెన్నుపోటు పొడిచిన విధానంపై రాజకీయ మేధావులతో చర్చించి ఒక సినిమా తీద్దామని నిర్ణయించుకున్నా. ఈ సినిమా పేరు వెన్నుపోటు ఈటలు” అంటూ ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. మరోవైపు రాజకీయపరంగా ఈటెల, కేసిఆర్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ స్క్రీన్ షాట్ ను ట్విట్టర్ లో పంచుకున్న రామ్ గోపాల్ వర్మ తన పేరుతో ఫేక్ ప్రచారం జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి వార్తలను నమ్మవద్దని సూచించారు.