ఓవ‌ర్సీస్‌లో ఎఫ్3 క‌లెక్ష‌న్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

0
84

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. ఈ సినిమాలో హీరోల సరసన తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా..దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఎఫ్ 2 పోయిన 2019 సంక్రాంతికి విడుదలైన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఎఫ్3 ని అనిల్ రావిపూడి తెరెకెక్కించి భారీ అంచనాలతో మే 27వ తేదీన విడుదలై ధీయేటర్లలో సందడి చేసింది.  అయితే ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా..దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.ఈ సినిమా కుటుంబం మొత్తం థియేటర్‌లకు వచ్చి చూడాలనే లక్ష్యంతో చేసిన విధంగానే ఎంజాయ్ చేసారు.

అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓవ‌ర్సీస్‌లోనూ కలేక్షన్స్ ను చిత్రబృందం వెలువరించింది. ఈ చిత్రం ఓవ‌ర్సీస్‌లోనూ బాక్సాపీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతుంద‌ని స‌మాచారం తెలుస్తుంది. తాజా అప్డేట్ ప్ర‌కారం 5.82 కోట్ల‌కు పైగా రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి రానున్న రోజుల్లో ఎఫ్ 3 వ‌సూళ్ల రేంజ్‌ను మ‌రింత పెంచుకుంటూ దూసుకెళ్లడం ఖాయం అంటున్నారు సినీ ప్రముఖులు.