ఫ్రెండ్ కూతురికి చిరు సినిమాలో హీరోయిన్ ఛాన్స్

ఫ్రెండ్ కూతురికి చిరు సినిమాలో హీరోయిన్ ఛాన్స్

0
98

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సైరా చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ఎంతో కేర్ తీసుకున్నారు, ఈకధ సీన్లు మొత్తం బాలీవుడ్ రేంజ్ లో కనిపించనున్నాయి.. ప్రత్యేకంగా చరణ్ కూడా ఈసినిమాపై ఎంతో ఫోకస్ పెట్టారు. ఇక చిరు ఈ సినిమా షూటింగ్ నుంచి ఫ్రీ అయిన తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ లపై ఫోకస్ చేయనున్నారు.. ముఖ్యంగా ఇప్పటికే కొరటాల శివ, అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో రెండు సినిమాలు చేసేందుకు చిరు ఎస్ చెప్పారు, ఇప్పటికే స్టోరీ వర్క్ లో ఇద్దరు దిగ్గజ దర్శకులు బిజీగా ఉన్నారు.

ఇపుడు చిరు – కొరటాల శివ కాంబినేషన్ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త బయటకి వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా శృతిహసన్ ని చూశారట, కాని బాలీవుడ్ నుంచి కొత్త హీరోయిన్ ని తీసుకువచ్చే అవకాశం కూడా ఉంది అనే వార్త వినిపిస్తోంది. కాని శృతిహసన్ అయితే సినిమాకు బాగా సెట్ అవుతుంది అని టాక్ నడుస్తోంది. కొందరు మాత్రం దీనిపై ఇది ఫేక్ అని బాలీవుడ్ నుంచి ఈసారి చిరుకి సరసన హీరోయిన్ ని ఫైనల్ చేస్తారు అని అంటున్నారు. సో ఈ సినిమా గురించి పూర్తి అప్ డేట్ వచ్చే వరకూ ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి అనేది ఫిల్మ్ నగర్ టాక్.