వైయ‌స్ వివేకానంద‌రెడ్డి క‌న్నుమూత క‌న్నీరుమున్నీరైన జ‌గ‌న్

వైయ‌స్ వివేకానంద‌రెడ్డి క‌న్నుమూత క‌న్నీరుమున్నీరైన జ‌గ‌న్

0
51

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక‌ల‌ వేళ కోలుకోలేని షాక్ త‌గిలింది.. క‌డ‌ప జిల్లాలో వైయ‌స్ ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ బాబాయ్, వైయ‌స్ వివేకానంద‌రెడ్డి గుండెపోటుతో మ‌ర‌ణించారు,ఈ ఉద‌యం ఆయ‌న బాత్రూమ్ లో ఉన్న స‌మ‌యంలో హ‌ఠాత్తుగా గుండెపోటుకు గురి అయ్యారు. వెంట‌నే కుటుంబ స‌భ్యులు గ‌మ‌నించి ఆయ‌న‌ని ఆస్ప‌త్రికి తీసుకువెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించారు.. కాని ఆయ‌న అప్ప‌టికే మ‌ర‌ణించారు.

ఈ విష‌యం తెలియ‌డంతో వైసీపీ శ్రేణులు క‌న్నీరు మున్నీరు అయ్యారు.. మాజీ మంత్రిగా ఎమ్మెల్యేగా ఆయ‌న సేవ‌లు అందించారు. వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సోద‌రుల్లో ఆయ‌న ఒక‌రు, ఇక జిల్లాలో గ‌త ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న పోటీ చేశారు. ఈసారి ఆయ‌న ఎమ్మెల్యేగా బ‌రిలో నిల‌వ‌డం లేదు అని కుటుంబ స‌భ్యులు కొద్దిరోజులుగా చెబుతున్నారు.. గ‌త కొంత కాలంగా ఆయ‌న ఆరోగ్యం క్షీణించ‌డంతో ఆయ‌న పోటికి కూడా విముఖత చూపార‌ట.. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే జ‌గ‌న్ హైద‌రాబాద్ నుంచి పులివెందుల బ‌య‌లుదేరారు.. ఇటీవ‌లే వైయ‌స్ వివేకాకు గుండెపోటు రావడంతో వైఎస్ వివేకా స్టెంట్ వేయించుకున్నారు.