ఓటీటీలోకి ప్రభాస్ రాధేశ్యామ్‌..స్ట్రీమింగ్‌ ఎప్పటి నుండి అంటే?

0
79

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహేగ్దే జంటగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్చి 11న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చి కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విడుదలపై చర్చ మొదలైంది. రాధేశ్యామ్‌ డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసకున్నట్లు మొదటి నుంచే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ మొత్తానికి అమెజాన్‌ డిజిల్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఇక రాధేశ్యామ్‌ ఓటీటీలో ఎప్పుడు రానుందన్న దానిపై ఓ చర్చ నడుస్తోంది. సినిమా విడుదలైన 4 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల కావాలని ముందుగానే ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

ఈ లెక్కన చూస్తే రాధేశ్యామ్‌ ఏప్రిల్‌ 11 తర్వాత ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. అయితే అంతకు ముందే ఏప్రిల్‌ 2న ఉగాది పండగ ఉంది. ఈ కారణంగానే రాధేశ్యామ్‌ చిత్రాన్ని ఏప్రిల్‌ 2 మధ్యాహ్నం 12 గంటల నుంచి స్ట్రీమింగ్‌ మొదలు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి మరి.