Singer Sunitha |సింగర్ సునీత భర్తకు ప్రాణహాని.. పోలీసులకు ఫిర్యాదు

-

టాలీవుడ్ సీనియర్ సింగర్ సునీత(Singer Sunitha) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన పాటలు పాడి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నది. గతకొంత కాలం క్రితం ఒంటరి జీవితానికి స్వస్తి పలికి రామ్ వీరపనేనిని వివాహమాడిన విషయం తెలిసిందే. పెళ్లి జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు సాఫీగా సాగిన వీరి జీవితంలో అనూహ్యంగా సమస్యలు వచ్చి పడ్డాయి. సింగర్ సునీత భర్తకు బెదిరింపులు వచ్చాయి. ఓ వ్యక్తి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని.. తనకు ప్రాణహాని ఉందంటూ సునీత(Singer Sunitha) భర్త రామ్ వీరపనేని పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మణ్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నట్లు రామ్ వీరపనేని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను టాలీవుడ్ నిర్మాతల కౌన్సిల్‌ సభ్యుడినని ఫోన్‌కు మెసేజ్ పంపినట్లు వెల్లడించాడు. తనతో మాట్లాడాలని , వ్యక్తిగతంగా కలుద్దామని లక్ష్మణ్ తెలపడంతో.. తెలియని మనుషులతో తాను మాట్లాడనని బదులిచ్చినట్లు రామ్ తెలిపాడు.

- Advertisement -
Read Also: హద్దులు దాటిన అభిమానం.. ప్రాణం తీసిన ఫ్యాన్స్ వార్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...