నైట్ నాతో పడుకో.. చాన్స్ ఇస్తా..

నైట్ నాతో పడుకో.. చాన్స్ ఇస్తా..

0
80

ఇప్పటి వరకు సామాన్య మహిళలపైనే లైంగి దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సినీ హీరోయిన్లు, గాయనీలు కూడా లైంగిక వేధిపులకు బలైనట్టు ఒక్కొక్కరు మీ టూ ఉద్యమం పుణ్యమా అని తమ బాధలను సోషల్ మీడియా సాక్షిగా బయట పెడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ తో ఎంతో మంది అమ్మాయిలు తమ జీవితాలను దారుణంగా నాశనం చేసుకున్నారని..తెలుగు సినీ పరిశ్రమలో అమ్మాయిల మానాన్ని దోచుకోవడానికి దళారులు పని చేస్తున్నారని నటి శ్రీరెడ్డి పెద్ద ఎత్తున ఉద్యమం కూడా తీసుకు వచ్చింది. తాజాగా సింగర్ ప్రణవి కూడా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. ప్రణవి భర్త ప్రముఖ కొరియో గ్రాఫర్ రఘు..వీరిది ప్రేమ వివాహం.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రణవి మాట్లాడుతూ.. ఓ దర్శకుడి గురించి చెప్పుకొచ్చింది. తను ఇంటర్ చదువుతున్న సమయంలో ఓ టాలీవుడ్ దర్శకుడు తన సినిమాలో పాడే అవకాశ్మ్ కావాలంటే తనతో ఒకరోజు నైట్ మొత్తం గడపాలని కోరాడన్నారు. అతడు వయసుతొ సంబందం లేకుండా అలా అడిగినందుకు నీ వయసేంటీ? నా వయసేంటి…? చెంపలు వాయిస్తా అంటూ సిరియస్ అయి వచ్చాననని, ఆ తర్వాత అతను నాకు ముఖం చూపించేందుకు సిగ్గు పడ్డాడు.. అప్పటి నుంచి నాకు ఏ ఆఫర్ వచ్చిన అక్కడ ఉన్న వారి పరిస్థితి చూసి అంతా ఓకే అనుకుంటేనే పాటలు పాడేదాన్నని అన్నారు. నాలా చాలా మంది అమ్మాయిలకు ఇలాంటి ఛేదు అనుభవాలే ఎదురై ఉంటాయి..కాని సిగ్గుతో బయటకు చెప్పుకోలేక పోయారు. ఇలాంటి కామాంధులకు అక్కడే చెప్పు తీసుకొని కొట్టాలని ప్రణవి అన్నారు. తెలుగులో ‘యమదొంగ’, ‘శ్రీరామదాసు’, ‘జెంటిల్మెన్’, ‘ఒక మనసు’, ‘పెళ్లిచూపులు’ సినిమాల్లో హిట్ సాంగ్స్ పాడింది ప్రణవి.కానీ ఆ దర్షకుడి ఎౠ మాత్రం చెప్పలేదు ప్రణవి.