సౌందర్య గురించి కొన్ని విషయాలు చెప్పిన హీరో అర్జున్

సౌందర్య గురించి కొన్ని విషయాలు చెప్పిన హీరో అర్జున్

0
63

సినిమాల్లో యాక్షన్ హీరోగా చెప్పాలి అంటే ఒకే ఒక్క హీరో అర్జున్ అనే చెబుతారు.. ఆయనని సౌత్ ఇండియాలో సూపర్ యాక్షన్ హీరో అంటారు, ఆయన నటనకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.. డూబ్ లేకుండా నటించడం ఆయన స్టయిల్.

తెలుగు .. తమిళ.. మలయాళ .. కన్నడ సినిమాల్లో యాక్షన్ హీరోగా అర్జున్ మంచి మార్కులు కొట్టేశారు. ముఖ్యంగా ఆయనకు సక్సెస్ సినిమాలే చాలా ఎక్కువ.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
నటన వైపుకి వచ్చిన తరువాత ఎన్నో కష్టాలుపడ్డాను .. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ఆ పాఠాలను గుర్తుపెట్టుకుని ధైర్యంగా అడుగులు ముందుకు వేశాను. సినిమాల్లో అవకాశాలు అంత సులువుగా రాలేదు అని అన్నారు అర్జున్.

తనకు సినిమా పరిశ్రమలో చాలా మంది మిత్రులు అయ్యారని వారిలో జగపతిబాబు మంచి మిత్రుడు అన్నారు.
అలాగే హీరోయిన్ సౌందర్య ఒకరు అని తెలిపారు . మిస్ యూ అనే పదానికి అర్థం ఏమిటనేది సౌందర్య చనిపోయిన తరువాత తెలిసిందని. సౌందర్య ఎంత అందమైనదో .. అంతకి మించిన అభినయం ఆమె సొంతం. అందం, అభినయం పద్ధతి .. ఇలా అన్ని రకాల మంచి లక్షణాలన్నీ కలిపితే సౌందర్య అవుతుంది అని అన్నారు అర్జున్.. ఆమె లేకపోవడం చాలా బాధకలిగించింది అని మంచి స్నేహితురాలిని కోల్పోయాము అని బాధపడ్డారు అర్జున్.