సౌందర్య జీవితంలో జరిగిన ఈ విషయాలు మీకు తెలుసా

సౌందర్య జీవితంలో జరిగిన ఈ విషయాలు మీకు తెలుసా

0
96

తెలుగులో నటి సావిత్రి తర్వాత అంత పేరు తెచ్చుకున్న హీరోయిన్ అంటే సౌందర్య అనే చెప్పాలి, ఎన్నో సినిమాల్లో ఆమె నటించింది, తెలుగు తమిళ కన్నడ చిత్రాల్లో ఆమె అగ్ర హీరోయిన్ గా నిలబడింది.
సౌందర్య జులై 18, 1976న పుట్టింది.. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది.

సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీ రంగ ప్రవేశం తర్వాత ఆమె పేరు సౌందర్యగా మార్చుకుంది, ఆమె చిన్నతనం అంటే చదువుకునే సమయం నుంచి సినిమాల్లో నటించింది…ఆమె ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా, ఆమె తండ్రి స్నేహితుడు, గంధర్వ 1992 చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు.

అమ్మోరు చిత్రం విజయవంతమైన తరువాత, ఆమె చదువును మధ్యలోనే ఆపేసింది. ఇక తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. హిందీలో ఆమె అమితాబచ్చన్ తో కలిసి సూర్యవంశ్ అనే హిందీ చిత్రంలో నటించింది… గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించింది.నిర్మాతగా కూడా తన సత్తా చాటింది