ఏపీలో ఇంటి ద‌గ్గ‌రే కరోనా పరీక్షలు ఈ వెబ్ సైట్ లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి

ఏపీలో ఇంటి ద‌గ్గ‌రే కరోనా పరీక్షలు ఈ వెబ్ సైట్ లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి

0
38

ఏపీలో క‌రోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి, ఈ స‌మ‌యంలో టెస్టుల సంఖ్య కూడా మ‌రింత పెంచారు, ముఖ్యంగా అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.ఇప్పటికే 102 ఐమాస్క్ బస్సుల ద్వారా కరోనా టెస్టుల సంఖ్యను పెంచారు, ఏపీలో కోవిడ్ కేర్ ఆస్ప‌త్రుల‌ని పెంచారు, కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌ను పెంచారు.

అలాగే సంజీవని పరీక్షల ద్వారా కరోనా పాజిటివ్ తేలితే వారికి ఆసుపత్రుల్లో కానీ, హోం ఐసోలేషన్‌కు కానీ పంపుతున్నారు. ఇంటి ద‌గ్గ‌ర చికిత్స ఇస్తున్నారు, అనుమానాలు టెన్ష‌న్లు పెట్టుకుంటే కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

ఇక చాలా మంది బ‌య‌ట‌కు వెళ్లి క‌ర‌నా ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు, ఇక అలాంటి వారికి ఇంటి వద్దే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ముందుగా ఈ వెబ్ సైట్ లో రిజిస్ట్ర‌ర్ అవ్వాలి.

వెబ్ సైట్ – లింక్ – https://covid-andhrapradesh.verahealthcare.com/person/register

ఇలా వివ‌రాలు ఇచ్చిన త‌ర్వాత 24 గంటల్లోగా వైద్య సిబ్బంది ఇంటికి వచ్చి శాంపిల్స్ సేకరిస్తారు. సేకరించిన శాంపిల్ ఫలితాలు కూడా 48 గంటల్లో మొబైల్ ఫోన్‌కు పాజిటీవ్ ఆర్ నెగిటీవ్ అనే సందేశం పంపుతారు.