తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టర్ గా లేక హీరోయిన్ గా ఎదగాలన్నా ముందుగా మహిళలు బడా డైరెక్టర్స్, నిర్మాతలకు లైంగికంగా సహకరిస్తేనే అవకాశలు ఇస్తున్నారంటే ఇటీవలే నటి శ్రీ రెడ్డి దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికీ తన తన పోరాటం ఆపకుండా సోషల్ మీడియాలో ఒక్కొక్కరిని తోలుతీస్తోంది. అయితే ఆమె పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. దీంతో ఆమె కోరిక నెరవేరినట్లు అయింది. టాలీవుడ్ లో లైంగిక వెధింపులను స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్యానల్ ఏర్పాటు చేస్తూ 984 జీవోను విడుదల చేసింది. సిని పరిశ్రమకు చెందిన మహిళలు తమను ఎవరైనా లైంగికంగా వేదిస్తే ఈ ప్యానల్ లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.
అంతేకాదు ఇందుకు భాద్యులు అయిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాయని స్పష్టం చేసింది. ఈ ప్యానల్ లో నటి సుప్రియ, నటి యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలతో పాటు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫిసర్ వసంతి గాంధీ, మెడికల్ కళాశాల వైద్యులు రమాదేవి సామాజిక కార్యకర్త విజయలక్ష్మి కూడా ఉన్నారు.