వైసీపీకి షాక్ టీడీపీకి 135-18 ప‌క్కా

వైసీపీకి షాక్ టీడీపీకి 135-18 ప‌క్కా

0
100

ఏపీలో ఎన్నిక‌లు ముగిశాయి ఇప్పుడు ఏ పార్టీ ఎన్ని మోజార్టీ స్ధానాల‌తో అధికారంలోకి వ‌స్తుంద‌నే విష‌యంపై అంచ‌నాలు వేసుకుంటు బిజీగా గ‌డుపుతున్నారు. మ‌రోసారి తామే అధికారంలోకి వ‌స్తామంటు టీడీపీ నాయ‌కులు అంటుంటే బైబై బాబు అంటు వైసీపీ నాయ‌కులు అంటున్నారు.

ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా త‌న ప‌ల్ల‌విని మార్చుకుని తాను కూడా ముఖ్య‌మంత్రి అవుతానంటున్నారు. ఈ త్రిముఖ పోరులో తాజా మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియ‌ర్ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీపై తెలుగుదేశం 135 అసెంబ్లీ స్థానాల‌ను అలాగే 18 పార్ల‌మెంట్ స్ధానాల‌ను కైవసం చేసుకుంటుంద‌ని త‌న జోస్యం చెప్పారు.

తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌లలో కూడా సీఎం కాలేడ‌ని అన్నారు. రాష్ట్రం మ‌రింత అభివృద్ది చెందాలంటే మ‌రోసారి చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి కావాల‌ని అన్నారు. జ‌గ‌న్ కేసీఆర్, మోడీలు చంద్ర‌బాబు పై ఎన్నికుట్ర‌లు ప‌డినా టీడీపీదే విజ‌యం అని గోరంట్ల అన్నారు.