శ్రీవల్లికి మోకాళ్ల నొప్పి..పుష్పకు భుజం నొప్పి..వైరల్ అవుతున్న డాక్టర్ పోస్ట్

0
101

పుష్ప సినిమాతో రష్మిక దశ దిశ తిరిగింది. ఏకంగా పాన్ ఇండియా క్రష్ గా మారిపోయింది రష్మిక మందన్న. ఈ సినిమా తర్వాత రష్మికకు బోలెడు ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో మెరుస్తుంది. తన అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడుకు సంబంధించి కొన్ని షాకింగ్ నిజాలు బయటకొచ్చాయి.

గత కొంతకాలంగా హీరోయిన్ రష్మిక మోకాళ్ళ నొప్పితో బాధపడుతుంది. దీనితో ఆమె హైదరాబాద్ లోని ప్రముఖ ఆర్ధోపెడిషియన్ డాక్టర్ గురువారెడ్డిని కలిసింది. ఈ సందర్బంగా డాక్టర్ గురువారెడ్డి తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఫన్నీగా స్పందించారు. రష్మికకు మోకాళ్ల నొప్పులపై ఆయన స్పందిస్తూ..సామి..సామి అంటూ బరువంతా మోకాళ్లపై వేయడం వల్లే మోకాళ్ల నొప్పులు వచ్చాయని అన్నారు. పుష్ప సినిమా చూసి నేనే ఆమెను కలవాలనుకున్న కానీ మోకాళ్ల నొప్పులతో తనే నా దగ్గరకు వచ్చింది. ఇక త్వరలో అల్లు అర్జున్ భుజం నొప్పితో తన దగ్గరికి వస్తాడేమోనని సరదాగా డాక్టర్ వ్యాఖ్యానించారు.