Sruthi hasan: అందాన్ని ఆర్టిఫిషియల్‌గా పెంచాలనుకోవటం ఇప్పుడు కామన్ అయిపోయింది అందులో తప్పేముందని హీరోయిన్ శృతిహాసన్( Sruthi hasan) అన్నారు. ‘హాటర్‌ఫ్లై ది మేల్ ఫెమినిస్ట్ ఎపిసోడ్’లో పాల్గొన్న ఆమె, తన వ్యక్తిగత విషయాలపై నెటిజన్లు డిస్కస్ చేయటం ఆపేయాలని అన్నారు. తన బాడీపార్ట్స్ సర్జరీ గురించి, ముఖ్యంగా ముక్కు శస్త్రచికిత్సపై చర్చ జరగటం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.. అందాన్ని ఆర్టిఫిషియల్‌గా పెంచాలనుకోవటం కామన్.. అందుకోసం కాస్మోటిక్ వైపు తాను మెుగ్గు చూపినట్లు వివరించారు. ఒకానొక సందర్భం తన ముక్కు విరిగిపోయిందనీ.. అయినా.. అలానే తన మెుదటి సినిమాలో నటించినట్లు శృతిహాసన్ తెలిపారు. తాజాగా విరిగిన ముక్కును సరిచేసుకొని, మునుపటి కంటే భిన్నంగా తయారు చేయించుకున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా నెటిజన్స్ టార్గెట్ చేసి కామెంట్స్ చేయటం తనను ఎంతో బాధించిందని అన్నారు. అందరి ముందు తనను తాను సమర్థించుకోవాల్సిన అవసరం తనకు లేదనీ.. ఎందుకంటే ఎలా చేసినా ఏదో విధంగా ట్రోల్ చేస్తారని తెలుసునని అన్నారు. కాబట్టి ఎవరినీ సంతృప్తి పరచాల్సిన అవసరం తనకు లేదని శృతిహాసన్ చెప్పుకొచ్చారు.