ట్రెండింగ్ లో SSMB#29..మహేష్ బాబుతో సినిమాపై రాజమౌళి బిగ్ అనౌన్స్ మెంట్

0
49

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. మహర్షి, సరిలేరు నీకెవ్వరూ లాంటి సినిమాలతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు సూపర్ స్టార్. ఇక తాజాగా ఆయన వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఓ వైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తూ మరో బిగ్ మూవీకి ఒకే చెప్పాడు.

టాలీవుడ్ జక్కన్న, సంచలన దర్శకుడు రాజమౌళి-మహేష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది. ఇతర విషయాల గురించి బయటకు రాలేదు. తాజాగా రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో SSMB#29 సినిమాగా తెరకెక్కుతున్నట్టు ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీ గ్లోబెట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిస్తున్నట్లు రాజమౌళి తెలిపారు.

కాగా RRR వంటి భారీ హిట్ తరువాత జక్కన్న తెరకెక్కుతున్న సినిమా కావడంతో అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నట్లు తెలుస్తుంది. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా షూటింగ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా తరువాత జక్కన్న కాంపౌండ్ లోకి సూపర్ స్టార్ రానున్నారు.