ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో స్టార్ డైరెక్టర్ సినిమా?

Star director film with icon star Allu Arjun?

0
110

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అఖండ మూవీ సూపర్ హిట్ కావడంతో బోయపాటి నెక్ట్ మూవీపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప రికార్డుల సునామీ సృష్టిస్తోంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

బోయపాటి బన్నీ కోసం యాక్షన్ స్క్రిప్ట్ రెడీ చేశాడని తెలుస్తోంది. దీన్ని అల్లు అర్జున్ నిర్మిస్తారని సమాచారం. ఈ సినిమాను పాన్ ఇండియాలో లెవల్లో తీస్తున్నట్లు సమాచారం. 2022 సమ్మర్ లో ఈ సినిమా పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సూపర్ డూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.

మరోసారి వీరిద్దరి కలయితో వచ్చే సినిమాపై అభిమానుల అంచనాలు విపరీతంగా ఉండనున్నాయి. వినయ విధేయ రామ డిజాస్టర్ తరువాత..బాలయ్యతో చేసిన అఖండ సూపర్ డూపర్ హిట్ అయింది. మాస్ ప్రేక్షకులకు సినిమా పిచ్చపిచ్చగా నచ్చింది. బోయపాటి బాలయ్య బాబును చూపించిన విధానం ముఖ్యంగా ఆయన అభిమానులకు విపరీతంగా నచ్చింది.