దర్శకుడిగా అవతారమెత్తుతున్న స్టార్ హీరో..

0
93

మాలీవుడ్ స్టార్ హారో మోహన్ లాల్ తనదైన శైలిలో సినిమాలు నటించి సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుకున్నాడు. ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన ఈ హీరో ప్రస్తుతం మరో అవతారం ఎత్తడానికి సిద్ధపడ్డాడు. కేవలం హీరోగానే కాకుండా.. దర్శకుడిగా కూడా చేయడానికి రెడీ అయ్యాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో ఫ్యాన్స్ కు కాస్త ఊరట కలిగేలా.. కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా వ్యవహరిస్తున్నట్లు దిగిన ఫొటో ఒకటి మోహన్ లాల్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయడంతో..ఈ ఫోటో తెగ వైరలవుతోంది. ‘బరోజ్’ అనే వాస్కోడిగామా నిధులు కాపాడిన వ్యక్తికి సంబంధించిన కథను వెండితెరపైన మోహన్ లాల్ ఆవిష్కరిస్తున్నారు. ఇందులో హీరోగా నటిస్తూనే మోహన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 24న విడుదల కానుంది. మాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కీలక పాత్ర  పోషించగా..ఇటీవలే మోహన్ లాల్ నటించిన ‘12th Man’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా విడుదలయి విశేష స్పందన సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అభిమానులు మోహన్ లాల్ దర్శకుడిగా ఎలాంటి రీకార్డ్స్ క్రీయేట్ చేస్తాడోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.