గిరిజన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్న స్టార్ హీరో

0
100

మలయాళ స్టార్ హీరో అయినా మోహన్ లాల్ తెలుగులో సూపర్ హిట్ మూవీ ‘జనతా గ్యారేజ్’లో కీలక పాత్ర పోషించిన విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మలయాళలో కూడా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

కేవలం నటనతోనే కాకుండా..తనకున్న మంచి మనసుతో పేదపిల్లలను ఉచితంగా చదివివ్వడానికి సిద్ధం అయ్యి..రియల్ లైఫ్ లో కూడా ప్రేక్షకుల అదరాభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. కేరళలోని గిరిజన తెగకు చెందిన 20మంది విద్యార్థులకు 15ఏళ్ల పాటు ఉచిత విద్యను అందించేందుకు ముందుకు వచ్చాడు. ఈ విద్యకు అయ్యే ఖర్చును విశ్వశాంతి ఫౌండేషన్​కు చెందిన వింటేజ్​ పథకం ద్వారా చెల్లించనున్నట్టు తెలిపారు.

అలాగే వారికి నచ్చిన కోర్సుల్లో చదివిస్తామని విశ్వశాంతి ఫౌండేషన్‌ ప్రకటించింది. వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచేందుకు వచ్చే 15ఏళ్ల పాటు ఉత్తమ విద్య, వనరులను అందిస్తాం” అని ఫేస్‌బుక్‌ పేజీలో మోహన్‌ లాల్‌ పేర్కొన్నారు. మోహన్ లాల్ చేస్తున్న మంచి పనికి సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అందరు అభినందిస్తున్నారు.