చిరు ను చూసి రాజకీయాల్లోకి వెళ్లకూడదని నిశ్చయించుకున్నా..!!

చిరు ను చూసి రాజకీయాల్లోకి వెళ్లకూడదని నిశ్చయించుకున్నా..!!

0
74

కన్నడ సూపర్ స్టార్ నటించిన పహిల్వాన్ సినిమా అటు కన్నడ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమా తో మరో హిట్ కొట్టిన సుదీప్ తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. ప్రజా రాజ్యం పార్టీ పెట్టిన చిరు పొలిటికల్ కెరీర్‌ ఎలా బెడిసికొట్టిందో అందరికీ తెలిసిందే. అది చూసి తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నానని అంటున్నారు

‘ఈగ’ మూవీలో సుదీప్ విలన్ గా నటించినా..హీరో రేంజ్ లో పేరు సంపాదించాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో నటిస్తున్నాడు. పదేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్లు.. ఇప్పుడు దీనిని పక్కనబెట్టి రాజకీయాల్లోకి వెళ్లలేను అని చెప్పారు. ఇప్పటికే తనను చాలా మంది రాజకీయాల్లోకి ఆహ్వానించారని కానీ తను వెళ్లలేదని అన్నారు. రాజకీయాల్లోకి వెళితే ఉదయం లేవగానే తిట్టుకుంటూ ఉండాలని..పదిమందితో తిట్లు తినాలి..ఎన్నో ఇబ్బందులు ఉంటాయి..అది చిరు సార్ చూస్తే ఆయన ఎందుకు ఇమడలేక పోయారో అర్థం అయ్యింది.