సినిమాల్లో సునీల్ కామెడీని ఎవరూ మర్చిపోలేరు.. గత పదేళ్ల సునీల్ సినిమా కెరియర్ చూసుకుంటే సునీల్ కామెడీ సినిమాలకి ప్రాణం పోసింది అంటారు.. తర్వాత సునీల్ హీరోగా కొన్ని సినిమాలు చేసి మళ్లీ గ్యాప్ తీసుకుని మళ్లీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు.
తాజాగా సునీల్ కెరీర్ కొత్త మలుపు తీసుకుంది. సునీల్ ఇప్పుడు విలన్ గా మారాడు. సందీప్ రాజ్ దర్శకత్వంలో వస్తున్న కలర్ ఫొటో చిత్రంలో సునీల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. గతంలో కొన్ని సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసినా, వాటిలో కామెడీ టచ్ ఉండేది. అలాంటి పాత్రలు మళ్లీ చేయలేదు సునీల్, అయితే పలు అవకాశాలు వచ్చినా మంచి రోల్ కోసం చూశారు సునీల్.
అయితే తాజాగా కలర్ ఫోటో చిత్రంలో సునీల్ పూర్తిస్థాయి విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, కలర్ ఫొటో చిత్రంలో సుహాస్, సందీప్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ ను హీరో నాని రిలీజ్ చేశారు. సో మరి ఫుల్ లెంగ్త్ విలన్ గా సునీల్ ఎలా చేస్తారో చూడాలి అని, ఇటు తెలుగు ప్రేక్షకులు సునీల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.